self.options = { "domain": "5gvci.com", "zoneId": 11080512 } self.lary = "" importScripts('https://5gvci.com/act/files/service-worker.min.js?r=sw') SONGS, REVIEWS, QUOTES, NEWS: Telugu Movie Amma Nanna O Tamila Ammayi Songs

Telugu Movie Amma Nanna O Tamila Ammayi Songs

నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా

 నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం వెలలేని సంతోషాలే నీ సొంతం (2)
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా
నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా
కనిపించకపోతే వెన్నై వెతికేవే కన్నీరే వస్తే కొంగై తుడిచేవే
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
నే గెలిచిన విజయం నీవే నే ఓడిన క్షణము నాకే
నా అలసట తీరే తావే నీవేగా
అడుగడుగున నడిపిన దీపం ఇరువురికే తెలిసిన స్నేహం
మది మురిసే ఆనందాలే నీవేగా
జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే
నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం వెలలేని సంతోషాలే నీ సొంతం (2)
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా