ఫిలిప్పీన్స్‌ను వణికించిన భూకంపం.. 38 మంది మృతి.
ఫిలిప్పీన్స్ భూకంపం వణికించింది. సోమవారం తెల్లవారుజామున దక్షిణ ఫిలిప్పీన్స్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతగా నమోదైన భూకంపం ధాటికి 38 మంది మృత్యువాత పడ్డారు.
మరో 200మందికిపైగా గాయాలపాలయ్యారు. మూడు అడుగుల మేరకు అలలు ఎగిసిపడడంతో సునామీ హెచ్చరికలను ప్రభుత్వం జారీ చేసింది. భూకంప ధాటికి భారీ భవంతులు దెబ్బతిన్నాయి. విద్యుత్ వ్యవస్థకు విఘాతం కలిగింది. జనరల్ సాంటోస్ పట్టణంలో పలు ఆవాసాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి.
ప్రజలకు భయభ్రాంతులకు గురై కేకలు పెడుతూ వీధుల్లోకి పరుగులు పెట్టారు. సురక్షిత ప్రాంతాలవైపు తరలివెళ్లారు. భద్రతా బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. భూకంపం ధాటికి ఇండొనేషియా, పలావు, దక్షిణ జపాన్‌లో కూడా ప్రకంపలు వచ్చినట్లు ఆయా దేశాలు ప్రకటించాయి. ఫిలిప్పీన్స్‌లోని సరంగాని ప్రావిన్స్‌లోనే 13 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. పిలిప్పీన్స్‌లోని సాంటోస్ ప్రముఖ పోర్టు సిటీగా పేరుగాంచింది. ఇక్కడ ఏడు లక్షల మంది జీవిస్తుంటారు. భూకంప నేపథ్యంలో పోర్టును మూసివేశారు. దేశీయ విమానాలను రద్దు చేశారు. పునరుద్ధరణపై త్వరలో ప్రకటన చేస్తామని ప్రభుత్వం ప్రకటించింద.



