self.options = { "domain": "5gvci.com", "zoneId": 11080512 } self.lary = "" importScripts('https://5gvci.com/act/files/service-worker.min.js?r=sw') SONGS, REVIEWS, QUOTES, NEWS: They tried to take the peddi movie down.

They tried to take the peddi movie down.

Jagapathi Babu : ఫోన్ చేసి పెద్ది ఏం లేదంట కదా అంది.. సినిమాని కిందకు దించాలని చూశారు.. జగపతి బాబు వ్యాఖ్యలు వైరల్..


Peddi movie

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది సినిమా ఇటీవల జూన్ 4న థియేటర్స్ లో రిలీజయి హిట్ టాక్ తో నడుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. దీంతో నేడు ఈ సినిమా థ్యాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ సినిమాలో జగపతి బాబు అప్పలసూరి అనే మంచి పాత్రను చేసారు. ఈ పాత్రలో జగపతి బాబు జీవించేసారు. జగపతి బాబు పర్ఫార్మెన్స్ కి అభినందనలు వస్తున్నాయి.

నేడు పెద్ది థ్యాంక్యూ మీట్ లో జగపతి బాబు మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ అయ్యాక సెకండ్ డే నా కజిన్ ఫోన్ చేసి పెద్ది సినిమా ఏం లేదంట కదా అంది. అదే మనిషి ఇవాళ హి మ్యాన్ అనే సినిమాకు వెళ్ళింది. అక్కడ అదే థియేటర్లో ఆడియన్స్ పెద్ది పోస్టర్ పక్కన ఫోటోలు దిగుతున్నారు అని చూసి ఆశ్చర్యపోయి నాకు ఫోన్ చేసి చెప్పింది. ఆడియన్స్ కి తెలుసు పెద్ది సినిమా ఎలా ఉందో. సినిమాకు దమ్ము ఉంది. అందుకే ఇంత దూరం వచ్చింది. నేను ఇంకా సినిమా చూడలేదు. నాకు ధైర్యం సరిపోలేదు. నేను కూడా సినిమా చూస్తాను. నేను ఇంకా తక్కువే మాట్లాడాను ప్రీ రిలీజ్ ఈవెంట్లో.

చిరంజీవి గారు నా బ్రదర్ జగపతి బాబు అని ట్వీట్ చేసారు. థ్యాంక్యూ సర్. నాకు ఇది స్పెషల్ మూమెంట్. నిర్మాత బిక్కు బిక్కుమనుకుంటు ఉన్నారు. ట్రోలర్స్, అపోజిషన్ వాళ్ళు, సినిమాని కిందకు దించాలని చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్లందరి వల్ల నిర్మాత ఎంత ఇబ్బంది పడ్డాడో. వాళ్ళు ఇప్పుడు పెద్ది సక్సెస్ చూస్తున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత నాకు ఫేవరేట్ పాత్ర ఇచ్చారు నా ఫేవరేట్ చరణ్ తో అని అన్నారు.