self.options = { "domain": "5gvci.com", "zoneId": 11080512 } self.lary = "" importScripts('https://5gvci.com/act/files/service-worker.min.js?r=sw') SONGS, REVIEWS, QUOTES, NEWS: Visakhapatnam Steel Plant... Death toll reaches 9

Visakhapatnam Steel Plant... Death toll reaches 9

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం... 9కి చేరిన మృతుల సంఖ్య


విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం... 9కి చేరిన మృతుల సంఖ్య

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నాం స్టీల్ ప్లాంట్‌లోని ఎస్ఎంఎస్ -2,ఎస్ఎంఎస్- 3 హీట్ ఎఫ్‌జీలో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ పేలడంతో ఉక్కు ద్రవం లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటలను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.

వైజాగ్ స్లీల్ ప్లాంట్‌లో ప్రమాదం
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం జరిగింది. CCD విభాగంలోని లిక్విడ్ స్టీల్ నిర్వహణలో ప్రమాదం జరిగింది. హాట్ మెటల్ బకెట్ కుప్పకూలింది. కార్మికులపై ద్రవ ఉక్కు పడింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతిచెందారు. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు ప్రమాదం జరిగిన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్‌లో ఆందోళన నెలకొంది.

సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి
స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై పరిస్థితి, సహయక చర్యలను ముఖ్యమంత్రికి అధికారులకు వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో సహయక చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.