self.options = { "domain": "5gvci.com", "zoneId": 11080512 } self.lary = "" importScripts('https://5gvci.com/act/files/service-worker.min.js?r=sw') SONGS, REVIEWS, QUOTES, NEWS: Guppedu manasu song mouname nee basha

Guppedu manasu song mouname nee basha

 మౌనమే నీ భాష ఓ మూగ మనసా

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో

మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు మౌనమే నీ భాష ఓ మూగ మనసా మౌనమే నీ భాష ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా