self.options = { "domain": "5gvci.com", "zoneId": 11080512 } self.lary = "" importScripts('https://5gvci.com/act/files/service-worker.min.js?r=sw') SONGS, REVIEWS, QUOTES, NEWS: ILLALU(1981) song O batasari

ILLALU(1981) song O batasari

 ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి...

ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి...
ఎంతదూరమో ఏది అంతమో ఎవరూ ఎరుగని దారి ఇది
ఒకరికి సొంతం కాదు ఇది
ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి...

ఎవరు ఎవరికి తోడవుతారో.. ఎప్పుడెందుకు విడిపోతారో...
మమతను కాదని వెళతారో.. మనసే చాలని ఉంటారో...
ఎవ్వరి పయనం ఎందాకో...
అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ
అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ
ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి...
ఎంతదూరమో ఏది అంతమో ఎవరూ ఎరుగని దారి ఇది
ఒకరికి సొంతం కాదు ఇది
ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి...

కడుపు తీపికి రుజువేముంది.. అంతకు మించిన నిజమేముంది...
కాయే చెట్టుకు బరువైతే చెట్టును భూమి మోస్తుందా
ఇప్పుడు తప్పును తెలుసుకునీ
జరిగేదే మిటనీ క్షమించదెవ్వరిని...
జరిగేదే మిటనీ క్షమించదెవ్వరిని...
ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి...

తెంచుకుంటివి అనుబంధాన్ని..
పెంచుకున్నదొక హృదయం దాన్ని...
అమ్మలిద్దరూ ఉంటారని అనుకోలేని పసివాణ్ణి
బలవంతాన తెచ్చుకునీ
తల్లివి కాగలవా తనయుడు కాగలడా..
తల్లివి కాగలవా తనయుడు కాగలడా...
ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి...

అడ్డదారిలో వచ్చావమ్మా.. అనుకోకుండా కలిశావమ్మా...
నెత్తురు పంచి ఇచ్చావు.. నిప్పును నువ్వే మింగావు...
ఆడదాని ఐశ్వర్యమేమిటో
ఇప్పుడు తెలిసింది.. కథ ముగిసేపోయింది...
ఇప్పుడు తెలిసింది.. కథ ముగిసేపోయింది...
ఓ బాటసారి ఇది జీవిత రహదారి...