అవును మీరు వింటున్నది నిజమే.. ఒకే గ్రామానికి రెండు పేర్లు ఉన్నాయి. గతంలో ఒక పేరు ఉంది.. కొన్ని మార్పులు, చేర్పుల తర్వాత మరో పేరు వాడుకలోకి వచ్చింది.
కృష్ణా జిల్లాలో బాపులపాడు ఉంది.. ఎన్నో ఏళ్లుగా హనుమాన్‌జంక్షన్‌గా ప్రాచుర్యంలోకి వచ్చింది. అక్కడ నాలుగు రోడ్ల కూడలి, అభయాంజనేయస్వామి కొలువుదీరడంతో ఆ ఊరి పేరును హనుమాన్‌జంక్షన్‌గా మారింది. ఈ ప్రాంతం మండల కేంద్రంగా ఉండటంతో ప్రభుత్వ రికార్డులు, అధికారిక వ్యవహారాల్లో మాత్రం బాపులపాడుతోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
అయితే ఆర్టీసీ బస్టాండ్, బ్యాంకులు, పోస్టాఫీస్‌లు మాత్రం హనుమాన్‌జంక్షన్ పేరుతో ఉన్నాయి. ఈ మండల కేంద్రం శివారులో స్వాగతం చెబుతూ ఏర్పాటు చేసిన వాల్‌పై రెండు పేర్లతో ఏర్పాటు చేశారు. మొత్తం రెండు పేర్లతో బాపులపాడు చెలామణిలో ఉన్నాయి. అయితే హనుమాన్‌జంక్షన్ అంటే అందరికి తెలుసు.. నాలుగు రోడ్ల కూడలి కావడంతో ఈ జంక్షన్‌గా పిలుస్తున్నారు. మూడు మేజరు గ్రామ పంచాయతీలు కలిపి ఎక్కువమందికి తెలియదు. కృష్ణా, ఏలూరు జిల్లాల సరిహద్దులో హనుమాన్ జంక్షన్ ఉంది.
