self.options = { "domain": "5gvci.com", "zoneId": 11080512 } self.lary = "" importScripts('https://5gvci.com/act/files/service-worker.min.js?r=sw') SONGS, REVIEWS, QUOTES, NEWS: అమలాపురంలో బాలిక అదృశ్యం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

అమలాపురంలో బాలిక అదృశ్యం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు



అమలాపురం: ట్యూషన్‌కు వెళ్లిన ఓ బాలిక అదృశ్యం అవ్వడం అమలాపురం పట్టణంలో కలకలం రేపింది.. స్థానిక ఓ పాఠశాలలో బాలిక 10 తరగతి చదువుతుండగా స్కూల్ నుంచి వచ్చాక మళ్లీ ట్యూషన్‌కు వెళ్లింది..
అయితే తిరిగి రాకపోవడంతో ఆందోళన నెలకొండి. అమలాపురం పట్టణంకు చెందిన అమలదాసు హర్షిత(14) గురువారం స్కూల్ నుంచివచ్చాక రోజూలానే ట్యూషన్‌కు అని వెళ్లింది.. అయితే తిరిగి రాకపోవడంతో ట్యూషన్ వద్ద ఆరాతీశారు.. అయితే అక్కడికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్లలేదని తేలడంతో దగ్గర్లో ఉన్న సీసీ కెమెరాల పుటేజీను పరిశీలించారు.

అమలాపురం పట్టణ సీఐ వీరబాబు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయగా ఓ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరా పుటేజిల్లో బాలిక అటువైపుగా వెళ్తున్న దృశ్యం కనిపించింది. అయితే ఇంటివద్ద కూడా తనిఖీలు చేసిన పోలీసులకు తన నోట్ పుస్తకంలో రాసిన కొన్ని మాటలు పోలీసులకు కనపడ్డాయని తెలిసింది. అక్కను బాగా చూస్తారని, తనను బాగా చూడడం లేదని రాసినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. బాలిక మనస్థాపం చెంది ఎక్కడికైనా వెళ్లిపోయిందా, లేదా ఎవ్వరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.. అయితే పోలీసులు బాలిక అదృశ్యం పై దర్యాప్తును ముమ్మరం చేసి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు..