OTT Telugu Movies: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 14 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 4 మాత్రం ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూడండి!

గత వారం తెలుగులో ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఆ సినిమాలన్నీ వివిధ జోనర్లతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్నాయి.


అవేంటో ఇక్కడ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

అనగనగా ఒక రాజు (తెలుగు రూరల్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 11

కొహ్రా సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ ప్రొసీజరల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 11

తలైవర్ తంబి తలైమయిల్ (తెలుగు డబ్బింగ్ తమిళ పొలిటికల్ సెటైరికల్ మూవీ)- ఫిబ్రవరి 12

టైలర్ పెర్రీస్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ రోడ్ కామెడీ సినిమా)- ఫిబ్రవరి 13

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

క్రాస్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 11

లవ్ మీ లవ్ మీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- ఫిబ్రవరి 13

ఘోస్ట్స్ ఇన్ ట్రబుల్ (జీఎస్‌టీ) (తెలుగు డబ్బింగ్ కన్నడ హారర్ కామెడీ ఫిల్మ్)- ఫిబ్రవరి 13

ఐ యామ్ గాడ్ (తెలుగు డబ్బింగ్ కన్నడ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 13

ఈటీవీ విన్ ఓటీటీ

మరువ తరమా (తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ లవ్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 14

బామ్మ చెప్పిన కథ (తెలుగు ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 15

జియో హాట్‌స్టార్ ఓటీటీ

ప్రిడేటర్: బాడ్‌ల్యాండ్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- ఫిబ్రవరి 12

ది కంజూరింగ్: లాస్ట్ రైట్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 13

మన శంకర వరప్రసాద్ గారు (తెలుగు కామెడీ యాక్షన్ డ్రామా సినిమా)- జీ5 ఓటీటీ- ఫిబ్రవరి 11

బేబీ గర్ల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- సోనీ లివ్ ఓటీటీ- ఫిబ్రవరి 12

ఓటీటీలోకి తెలుగులో 14 సినిమాలు

ఇలా గత వారం (ఫిబ్రవరి 9 నుంచి 15 వరకు) తెలుగు భాషలో ఏకంగా 14 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో అన్నీ సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

ఇంట్రెస్టింగ్‌గా 4

అయితే, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, మరువ తరమా, బామ్మ చెప్పిన కథ వంటి నాలుగు తెలుగు స్ట్రయిట్ సినిమాలు మాత్రం మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

సంక్రాంతి సినిమాలు

అయితే, ఈ నాలుగు సినిమాల్లో రెండు ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైనవే. జనవరి 12న మన శంకర వర ప్రసాద్ గారు, జనవరి 14న అనగనగా ఒక రాజు థియేటర్లలో విడుదలై మంచి హిట్స్ అందుకున్నాయి.

నేరుగా ఓటీటీలోకి

మరో రెండు ఇంట్రెస్టింగ్ సినిమాల్లో బామ్మ చెప్పిన కథ నేరుగా ఓటీటీ రిలీజ్ అయింది. మరోటి తెలుగు రొమాంటిక్ డ్రామా మరువ తరమా గతేడాది థియేటర్లలో విడుదలై ఐఎమ్‌డీబీ నుంచి ఏకంగా 9.1 రేటింగ్ సంపాదించుకుంది.