దీని నుంచి మూడు సినిమాలు కూడా వచ్చాయి. బెంగాలీలో పాపులర్ అయిన ఈ సిరీస్, 2025 చివరలో హిందీలోకి డబ్ అయ్యి Sony SAB ఛానల్‌లో ప్రసారమవుతోంది. ప్రస్తుతానికి ఈ సిరీస్ అధికారికంగా తెలుగులో అందుబాటులో లేదు. మీరు దీనిని Hoichoi ఓటీటీలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు. అయితే ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దమవుతోంది. మరో సారి ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేస్తోంది ఈ సిరీస్.
ఏ ఓటీటీలో చూడచ్చు అంటే
‘ఏకేన్ బాబు’ (Eken Babu) ఫ్రాంచైజీ నుంచి వస్తున్న ఈ సీజన్ 8 పేరు ‘ఏకేన్ బాబు: పురూలియా-ఏ పక్రావ్’ (Eken Babu: Purulia-e Pakrao). ఈ కొత్త సీజన్ 2026 ఏప్రిల్ 15నుంచి Hoichoi ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటివరకు 7 సీజన్లు, 3 సినిమాలు (The Eken, Eken Babu Eibar Kanchajunghay, The Eken: Benaras e Bibhishika) వచ్చి హిట్ అయ్యాయి. మరోసారి ‘ద ఏకేన్ 4’ (The Eken 4) అనే సినిమాను కూడా 2026 అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ . ఇందులో ఎప్పటిలాగే అనిర్బన్ చక్రవర్తి ఏకేన్ బాబుగా నటిస్తుండగా, ఆయన స్నేహితులు బాపి (సుహోత్ర ముఖోపాధ్యాయ), ప్రమథ (సోమక్ ఘోష్) పాత్రల్లో సందడి చేయనున్నారు.
స్టోరీ ఏమిటంటే
ఏకేన్ బాబు తన స్నేహితులు బాపి, ప్రమథలతో కలిసి పురూలియాలోని ఒక ఆశ్రమానికి విహారయాత్రకు వెళ్తాడు. అక్కడ ప్రశాంతంగా గడపాలని అనుకుంటాడు. ఆశ్రమంలో ఉండగా, అక్కడి పురాతనమైన అత్యంత విలువైన పచ్చ విగ్రహం అకస్మాత్తుగా మాయమవుతుంది. ఈ దొంగతనాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో, ఏకేన్ బాబుకు ఒక పెద్ద మెడికల్ కుంభకోణం గురించి తెలుస్తుంది. కొందరు కేటుగాళ్లు కలిసి చేస్తున్న మందుల దందాను, ఆ విగ్రహం దొంగతనాన్ని తనదైన శైలిలో కామెడీని పండిస్తూనే ఏకేన్ బాబు ఎలా కనిపెట్టాడనేదే ఈ సీజన్ కథ.
