Tollywood: Do you know how the hero of Shriya's debut film, 'Ishtam', passed away?

 కొందరి నటీనటుల మరణం ఇప్పటికీ మిస్టరీ గానే మిగిలిపోయింది. అందులో ఇష్టం హీరో చరణ్ రెడ్డి చావు కూడా ఒకటి. ఇష్టం ను ఇప్పటికీ గుర్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం శ్రియానే.


ఎందుకంటే ఇది ఆమె కు మొదటి . ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు ఈ ను నిర్మించారు. మనం, 24 లతో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కే కుమార్ ఈ ను తెరకెక్కించడం విశేషం. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో చరణ్ రెడ్డి హీరోగా నటించాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రియతో పాటు చరణ్ కు కూడా ఇది మొదటి నే. 2001లో రిలీజైన ఇష్టం ఓ మోస్తరుగా ఆడింది. హీరోయిన్ శ్రియ, హీరో చరణ్ రెడ్డిలకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే ఈ తర్వాత శ్రియ స్టార్ హీరోయిన గా ఎదిగిపోయింది. కానీ చరణ్ రెడ్డి మాత్రం మరే మూవీలోనూ కనిపించలేదు. అయితే ఇష్టం తర్వాత సుమారు 11 ఏళ్లకు అంటే 2012 మార్చి 19న చరణ్ రెడ్డి చనిపోయాడన్న వార్త టాలీవుడ్ తో పాటు అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

కాగా ఇష్టం తర్వాత చరణ్ రెడ్డి అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ('అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' హీరోయిన్) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. విడాకుల కోసం ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. ఇక చరణ్ చనిపోయేనాటికి అతని వయసు కేవలం 36 ఏళ్లు మాత్రమే. తీవ్రమైన గుండె నొప్పి రావడంతో మొదట అతనిని పోలో హాస్పిటల్ లో జాయిన్ చేసారు. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో చరణ్ కన్నుమూశాడు. అయితే ఆ తర్వాత ఆయనకు ఫోరెన్సిక్ బృందం నిర్వహించిన పరీక్షలో చరణ్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను పూర్తిగా తాగుడుకు బానిస అయ్యాడని, ఈ కారణంగానే అతని లివర్ పాడైందని వైద్య పరీక్షల్లో తేలింది. చరణ్ మరణానికి ఇదే ప్రధాన కారణమని డాక్టర్లు తేల్చేశారు.

కాగా చరణ్ అక్కినేని కుటుంబానికి అల్లుడని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అయితే తనకు సినీ అవకాశాలు లేకపోయినా, ఇతర ఇబ్బందుల్లో ఉన్నా ఎప్పుడూ ఆ ఫ్యామిలీ పేరును చరణ్ వాడుకోలేదని, ఇది అతని మంచితనానికి నిదర్శనమని తెలిసినవారు చెబుతుంటారు.