This bird cannot fly, but it is impossible to catch it.

ఈ పక్షి ఎగరదు కానీ దాన్ని పట్టుకోవడం అసాధ్యం.
ఈ పక్షి ఎగరదు కానీ దాన్ని పట్టుకోవడం అసాధ్యం.

దీని శాస్త్రీయ నామం జియోకోసిక్స్ కాలిఫోర్నియానస్. ఇది అమెరికా, మెక్సికో దేశాల ఎడారి ప్రాంతాల్లో కనిపించే కుక్కూ కుటుంబానికి చెందిన ప్రత్యేక పక్షి.

రోడ్ రన్నర్ పక్షి ప్రత్యేకత దాని వేగం. ఇది గంటకు సుమారు 30-32 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. అందుకే దీనిని పట్టుకోవడం చాలా జంతువులకు సవాలుగా మారుతుంది. అయితే పూర్తిగా అసాధ్యం కాదు.. కొన్ని వేటగాళ్లు దీనిని పట్టుకోగలుగుతాయి. ఈ పక్షి ఎక్కువగా ఎగరదు. అవసరమైనప్పుడు మాత్రమే తక్కువ దూరం ఎగురుతూ, ప్రధానంగా తన కాళ్లపై ఆధారపడి పరిగెడుతుంది. దాని వేగం వల్ల నేలపై ఉండే కీటకాలు, బల్లులు, చిన్న పాములను సులభంగా పట్టుకుని ఆహారంగా తీసుకుంటుంది.

ఎడారి జీవనానికి ఇది అద్భుతంగా అలవాటు పడింది. నీటిని ప్రత్యేకంగా తాగకపోయినా, తినే ఆహారం నుంచే అవసరమైన తేమను పొందగలదు. ఉదయం సమయంలో రెక్కలను విప్పి సూర్యుని వైపు నిలబడి శరీరాన్ని వేడెక్కించుకోవడం దీని ప్రత్యేక అలవాటు. ఇలా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకుంటూ ఎడారిలో మనుగడ సాగిస్తుంది.

రోడ్ రన్నర్ పక్షి సాధారణంగా 7 నుంచి 10 సంవత్సరాల వరకు జీవిస్తుంది. వేగం, చురుకుదనం, కఠిన పరిస్థితుల్లో బతికే సామర్థ్యం ఇవన్నీ కలిపి ఈ పక్షిని ఎడారి ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన జీవిగా నిలబెడుతున్నాయి.

ఈ పిట్ట భలే తెలివైంది.. పామును ఎట్టా మాయ చేస్తుందో తెలుసా..?