అమ్మమ్మ వయసులో ఆగని 'కామ కోరికలు'.. తాతయ్యతో గర్భం దాల్చిన అమ్మమ్మ.. కాలువలో పసికందును విసిరేసి హత్య..!
హస్నాబాద్ పరిధిలో సంచలనం సృష్టించిన శిశువు మృతి కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ సదానందం, సీఐ శ్రీను వివరాల ప్రకారం… 2025 జూలై 29న కేశనాయక్ తండా సమీపంలోని వాగులో గుర్తుతెలియని పసికందు మృతదేహం లభించింది.
పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో తండాకు చెందిన బానోతు లక్ష్మికి లేటు వయస్సులో గర్భం రావడంతో, విషయం బయటకు వస్తే పరువు పోతుందనే భయంతో ఆమె, భర్త రాజు కలిసి గర్భస్రావం చేయించుకోవాలని నిర్ణయించారు. కుందానవానిపల్లికి చెందిన ఆర్‌ఎంపీ వంశీ సహకారంతో అబార్షన్ టాబ్లెట్స్ వాడారు.అయితే శిశువు బతికే జన్మించడంతో, గ్రామంలో విషయం బయటపడుతుందనే భయంతో దంపతులు శిశువును రహస్యంగా చంపాలని నిర్ణయించారు. ఇంటి సమీపంలోని కాలువలో పడేయడంతో శిశువు నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో తల్లిదండ్రులు బానోతు లక్ష్మి, రాజు, అలాగే ఆర్‌ఎంపీ వంశీని అరెస్ట్ చేశారు.
