సంఘటన ముంబై లో ఒక యువకుడైన విద్యార్థి తన సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను గర్భవతిని చేశాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. (student rapes stepmother) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 55 ఏళ్ల వికాస్ శ్రీవాస్తవ ఒక ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. 2024లో ఉద్యోగం పేరుతో 26 ఏళ్ల మహిళ అతడికి పరిచయమైంది. వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడటంతో ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు.
కాగా, వికాస్ కుమారుడైన 21 ఏళ్ల అక్షత్ శ్రీవాస్తవ ఈ పెళ్లిని వ్యతిరేకించాడు. దీంతో సవతి తల్లి అయిన ఆ మహిళతో అతడు గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10న అక్షత్ తన గదిలోకి ప్రవేశించి అత్యాచారం చేశాడని ఆ మహిళ ఆరోపించింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని అతడు బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను గర్భం దాల్చినట్లు ఆమె పేర్కొంది.
మరోవైపు ఈ విషయం గురించి తన భర్తకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని ఆ మహిళ ఆరోపించింది. కుటుంబ పరువు, కొడుకు చదువు, అతడి భవిష్యత్తు కోసం మౌనంగా ఉండమని తనను కోరినట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేసిన నిందితుడు అక్షత్‌ను అరెస్ట్ చేశారు.

