Girl raped by uncle

బాలికపై మేనమామ అఘాయిత్యం.



నంద్యాల , 07 మే (హి.స.) నంద్యాల జిల్లా నందికొట్కూరు పోలీసుస్టేషన్ పరిధిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన మేనమామ తన కొడలి వరుస అయ్యే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలికపై మేనమామ అఘాయిత్యం


ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై బాలిక తండ్రి నందికొట్కూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు నింధితుడిపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.

ఘటన వివరాలిలా..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందికొట్కూరు పట్టణ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన బాలికపై ఆమె వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి.. గత కొంతకాలంగా కన్నేశాడు. బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, ఆమెను బెదిరించి లొంగదీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడు తన వరసను కూడా మర్చిపోయి ఈ అమానుషానికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఆరా తీయగా, అసలు విషయం బయటపడింది. మేనమామ చేసిన అకృత్యాన్ని బాలిక తన తండ్రికి వివరించింది. దీంతో బాధితురాలి తండ్రి నందికొట్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసి, నిందితుడిపై పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. అయితే కేసు దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుడిని వదిలిపెట్టబోమని అధికారులు స్పష్టం చేశారు.