విజయవాడ: నగరంలో 100 మందికి పైగా రౌడీషీటర్ల గ్యాంగ్‌ హల్‌చల్‌ చేశారు. రౌడీషీటర్‌ పండు అలియాస్‌ పావురం అంతిమయాత్రలో బైక్‌ ర్యాలీలు, డీజేలతో బీభత్సం సృష్టించారు.




భవానీపురంలో నివాసముంటున్న రౌడీషీటర్‌ పండు ఆటో నడుపుతూ.. యాక్సిడెంట్‌లో మృతిచెందగా.. మార్చురీ నుంచి ర్యాలీగా వస్తున్న సమయంలో రౌడీషీటర్లు రచ్చరచ్చ చేశారు. రౌడీషీటర్ల బీభత్సంపై పోలీసులు సీరియస్‌ అయ్యారు. ర్యాలీలో ఎవరెవరు పాల్గొన్నారనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు.