సీతా పయనం' (Seetha Payanam) చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నా కూతురు అద్భుతంగా నటించిందని ప్రశంసిస్తున్నారు.
చెడులోనూ మంచి ఉంటుందని ఇందులోని పాత్రలు తెలియజేస్తున్నాయి' అని అన్నారు హీరో అర్జున్ సర్జా (Arjun Sarja). ఆయన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలె విడుదలైంది.
ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో అర్జున్ మాట్లాడుతూ 'నేను గొప్ప సినిమా తీశాను అని అనడం లేదు కానీ, మేము చెప్పాలనుకున్నది ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. మేం ఎంతో నిజాయితీతో తీశాం. చూడని వాళ్లు వెంటనే చూడాలి' అని కోరారు. కథానాయిక ఐశ్వర్య మాట్లాడుతూ.. ఈ సినిమాకి ఇంత సపోర్ట్ చేస్తారని ఊహించలేదని అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
నిరంజన్ మాట్లాడుతూ 'ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు చాలా అనందంగా ఉంది' అని అన్నారు. నిరంజన్ మాట్లాడుతూ 'అన్ని ప్రాంతాల నుంచి సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి' అని చెప్పారు. సాయి మాధవ్ బుర్రా పాల్గొన్నారు.
