Horror Movie OTT : మార్చురీలో మతిపోగొట్టే పనులు. గుండెలదిరే సీన్స్. హర్రర్ మూవీ అంటే ఇలా ఉండాలి

lucky



డిజిటల్ ప్లాట్ ఫాంలలో ఎన్నో సినిమాలు అందుబాటులో ఉన్నప్పటికీ, హార్రర్ సినిమాలకు ఇంకేవీ సాటిరావు. ఈ జానర్ సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్ కు ఓటీటీలు వరంగా మారాయి.

సాధారణంగా హార్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్. ఇక ఓటీటీలో రకరకాల కథలతో ఉన్న హార్రర్ మూవీస్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మీ గురించి చెప్పుకోబోతున్నాము. మరి ఈ మూవీని ఏ ఓటిటిలో చూడొచ్చు? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హర్రర్ మూవీ పేరు ‘ది నైట్ షిఫ్టర్’ (the nightshifter movie). 2018 లో రిలీజ్ అయిన బ్రెజిలియన్ సూపర్ నేచురల్ హర్రర్ మూవీ ఇది. డెన్నిసన్ రమాహ్ల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మార్చురీలో జరిగే భయంకరమైన సీన్స్ ను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. సౌ పాలోలోని ఒక బిగ్ సిటీ మార్చురిలో రాత్రి షిప్ట్ లో పని చేసే స్టెనియో అనే వ్యక్తిని ఈ సినిమాలో చూడొచ్చు. సస్పెన్స్ తో పాటు గుండె జారిపోయే హర్రర్ సీన్స్ కూడా ఇందులో ఉంటాయి. 2018లో ఫెంటాస్టిక్ ఫెస్ట్ లో ప్రీమియర్ అయిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ఐఎండిబిలో ఈ సినిమాకు 5.7 రేటింగ్ ఉంది. దాదాపు ఒక గంట 42 నిమిషాల రన్ టైం ఉన్న ఈ మూవీని రాత్రి పూట చూస్తే థ్రిల్ పక్కా. ఇప్పటిదాకా ఈ మూవీని చూడకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హర్రర్ మూవీ లవర్స్ ను ఆకట్టుకున్న ఓ మంచి మూవీని మీరు మిస్ అయినట్టే. ఇక ఈ సినిమాలో డానియల్ డి వులివిరా స్టెనియో పాత్రలో అద్భుతంగా నటించాడు.