కేవలం సినిమాలకు మాత్రమే కాదు డాక్యుమెంటరీలు, సిరీసులు కూడా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ అక్కడిదాకానే ఆగిపోలేదు అప్పుడప్పుడు అదిరిపోయే షార్ట్ ఫిలిమ్స్ పై కూడా ఒక కన్నేస్తున్నారు ఆడియన్స్. మీకు కూడా అద్భుతమైన కంటెంట్ ఉన్న షార్ట్ ఫిలిమ్స్ ఇష్టం ఉంటే కచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న సినిమాపై ఒక లుక్కెయ్యండి. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
ఫ్రీగానే స్ట్రీమింగ్
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న షార్ట్ ఫిలిం పేరు ‘రాట్ ఇన్ ది కిచెన్’. 20023లో రిలీజ్ అయిన ఈ హిందీ సైకలాజికల్ షార్ట్ ఫిలిం కు అభిజిత్ పాండే దర్శకత్వం వహించారు. కేవలం 18 నిమిషాల వ్యవధితో నడిచే ఈ థ్రిల్లర్ మూవీలో స్టోరీ ఆకట్టుకుంటుంది. ఇందులో అర్జున్ మాథూర్, సౌమ్య తాప్తియా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని యూట్యూబ్లో ఫ్రీగానే చూడొచ్చు. ఐఎండిబిలో ఈ మూవీకి 7.5 రేటింగ్ ఉండడం మరో విశేషం. ముంబైలోని ఓ చిన్న అపార్ట్మెంట్లో సినిమా సాగుతుంది. క్యాస్ట్రోఫోబిక్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఒకే రాత్రిలో డిన్నర్ నుంచి మొదలై తెల్లారి వరకు సాగుతుంది. పైగా రన్ టైమ్ కూడా తక్కువే.
కథలోకి వెళ్తే…
సినిమా మొత్తం ప్రియా – రాజ్ అనే జంట చుట్టూ తిరుగుతుంది. ఓ అపార్ట్మెంట్లో వీరిద్దరూ కాపురం ఉంటారు. కానీ రాజ్ తన భార్య ప్రియాను ఏమాత్రం పట్టించుకోడు. తింటున్నప్పుడు కూడా మొబైల్ ఫోన్ చూడడం వంటివి చేస్తాడు. ఓ రోజు అతను కాల్ గర్ల్ తో ఫోన్ మాట్లాడుతూ భార్యకి దొరికిపోతాడు. ఆమె నిలదీయగా ముందు బుకాయిస్తాడు. కానీ చివరికి అసలు విషయాన్ని ఒప్పుకొని, అది కేవలం స్ట్రెస్ రిలీఫ్ కోసమని చెప్తాడు. ఇక తనను భర్త మోసం చేస్తున్నాడని తెలుసుకుని, ఆ భార్య ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అవుతుంది. కిచెన్ లో ఉన్న ఎలుకను చూస్తూ తన జీవితాన్ని ఆ జీవీతో పోల్చుకుంటుంది, బాధపడుతుంది. ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఉంటుంది.
ఎలాగైనా సరే భర్తకు బుద్ధి చెప్పాలని డిసైడ్ అవుతుంది. అతన్ని మెంటల్ గా టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఫుడ్ లో విషం కలిపి, అది అతన్ని బాధ పెట్టకుండా చంపేస్తుందని చెప్తుంది. విషయం తెలిసిన రాజ్ భయపడతాడు. క్లైమాక్స్ లో ప్రియా తన భర్తను కిచెన్ లో లాక్ చేస్తుంది. అలాగే అతని మొబైల్ ఫోన్ తీసుకుని రాజ్ తో మాట్లాడిన అమ్మాయితో మాట్లాడుతుంది. చివరికి హీరో బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా డోర్ లాక్ చేసి ఉండడం వల్ల వీలుపడదు. అక్కడ మళ్లీ ఎలుక కనిపించడంతో అతని మనసులో హ్యాలూజినేషన్ గా మొదలవుతుంది. మరి ఆ తర్వాత హీరో అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నాడు ? ప్రియా తన భర్తను అలాగే వదిలేసిందా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.
