చాలా కాలం నుండి ప్రేమలో మునిగి తేలుతున్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిద్దరూ కానీ, వీరి తరపు బంధువులు కానీ పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
కానీ వీరి పెళ్లికి సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి కార్డు కూడా వైరల్ గా మారింది. ప్రస్తుతం విజయ్ - రష్మిక వివాహానికి సంబంధించిన శుభలేఖల పంపిణీ కూడా జరుగుతోంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్, ఉదయపూర్ లోని ఓ ప్యాలెస్ లో వీరి వివాహం జరగనుంది.
ఇక ఈ పెళ్లికి కేవలం విజయ్ - రష్మిక తరపు బంధువులు మాత్రమే హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో రిసెప్షన్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు పెళ్లి పనులు స్పీడుగా జరుగుతున్న సమయంలో కన్నడ నటుడు అయిన ప్రమోద్ శెట్టి వీరి వివాహం గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రమోద్ శెట్టి మాట్లాడుతూ... నటుడు రక్షిత్ శెట్టిని, తనను రష్మిక తన వివాహానికి ఆహ్వానించదని తమకు ముందే తెలుసంటూ కామెంట్స్ చేశాడు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో కన్నడలో రక్షిత్ శెట్టి హీరోగా రూపొందిన కిరిక్ పార్టీ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించింది. అందులో ప్రమోద్ శెట్టి కూడా నటించాడు. ఆ సినిమా సమయంలో రక్షిత్, రష్మిక ప్రేమలో పడ్డారు. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నుండి రష్మిక చాలామంది కన్నడ శెట్టి నటులకు దూరంగా ఉంటుంది. దానితో మమ్మల్ని కూడా ఆమె పెళ్లికి పిలవదని భావిస్తున్నట్లు ప్రమోద్ శెట్టి చెప్పుకొచ్చాడు.
