Four Dead After Cold Storage Collapse కోల్డ్ స్టోరేజ్ కూలి నలుగురు మృతి

ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఓ కోల్డ్ స్టోరేజ్ కూలిపోవడంతో నలుగురు కార్మికులు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

అగ్నిమాపక దళం, పోలీసులతో సహా పలు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

Several relief teams, including the fire department and the police, reached the scene of the incident and undertook rescue operations.

అమ్మోనియా గ్యాస్ లీక్ అవ్వడంతో పేలుడు సంభవించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారి చెప్పారు. ఈ ఘటనకు గల కారణాన్ని తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించామని ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ కుమార్ వర్మ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఏడీఎం ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశామని, అది 24 నుంచి 48 గంటల్లో నివేదిక సమర్పించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Officials suspect that an explosion occurred following an ammonia gas leak. An official stated that the injured have been shifted to a hospital for treatment. Prayagraj District Magistrate Manish Kumar Verma informed that an inquiry has been initiated to ascertain the cause of the incident. He added that a committee, headed by the ADM (Finance), has been constituted to investigate the matter and is expected to submit its report within 24 to 48 hours.

ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశఆరు. మరణించిన వారికి సంతాపం తెలుపుతూ.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియాను ఆయన ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 అందజేయనున్నారు.

Prime Minister Modi expressed grief over this accident. Conveying his condolences to the deceased, he announced an ex-gratia payment of ₹2 lakh for the families of the victims. ₹50,000 will be provided to those who sustained injuries.

అలాగే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని యోగి, అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందేలా చూసేందుకు, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని జిల్లా పరిపాలన అధికారులను ఆదేశించారు.

Uttar Pradesh Chief Minister Yogi Adityanath also expressed deep anguish over this incident. Yogi directed officials to provide financial assistance of ₹2 lakh each to the families of those who lost their lives in this accident. He further instructed district administration officials to immediately shift the injured to a hospital to ensure they receive proper medical treatment.