రాజపేటలో సంచలనం సృష్టించిన యువకుని హత్య కేసులో నిజానిజాలను పోలీసులు రాబట్టారు. ఎస్సై వై.లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... తాళ్లపల్లి మధు పెయింటర్ తన తల్లి తండ్రులతో మౌలాలి, హైదరాబాద్‌లో నివాసం ఉంటూ అప్పుడప్పుడు రాజపేటకి వస్తుండేవారు.
అయితే మధుకి చాలా కాలంగా వారి ఇంటి దగ్గర గల జిడ్డి నాని అలియాస్ వెంకటేష్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు కలిసి తిరిగేవారు. కలిసి పెయింటింగ్ పనికి వెళ్ళేవారు. అయితే జిడ్డి నాని మరొక అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. తాళ్లపల్లి మధు నాని ప్రేమిస్తున్న అమ్మాయికి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు అని, ఆ అమ్మాయి నానికి చెప్పగా ఎలాగైనా మధుని అడగాలని నాని మధుకి ఫోన్ చేసింది. రాజాపేటలో పెయింటింగ్ పని ఉన్నదని చెప్పి మధును రాజాపేటకి రమ్మని చెప్పగా, మూడు రోజుల క్రితం మధు రాజాపేటకి వచ్చాడు. అయితే గురువారం రోజున రాత్రి మధు, నాని ఇద్దరు కలిసి మద్యం తాగుతున్నపుడు నాని నా లవర్‌కి ఎందుకు ఫోన్ చేశావ్ అని అడుగాడు.
అక్కడికక్కడే మృతి చెందిన మధు..
మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్లు మధు మాట్లాడగా, ఇద్దరు గొడవపడ్డారు. ఈ క్రమంలో మధు నానిని బాటిల్‌తో కొట్టాడు. ఈ విషయాన్ని మధు మనస్సులో పెట్టుకొని ఏమైనా చేయకపోతే వాడే నన్ను ఏదోరోజు చంపుతాడు అని అనుకుని అతన్ని ఎలాగైనా చంపాలని అనుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం మధు వాళ్ళ ఇంటికి నాని అక్కడికి వెళ్ళాడు. అక్కడ మధుతో పాటు అతని పెద్దమ్మ కొడుకు మహేష్, అతని ఫ్రెండ్ యోగేశ్వర్ కలిసి భోజనం చేస్తున్నారు. మధు నాని చూడగానే, ఎందుకురా మళ్ళీ నా దగ్గరికి వచ్చావ్ అంటూ అని రెచ్చగొట్టేలా మాట్లాడే సరికి, నానికి విపరీతమైన కోపం వచ్చింది. అదే కసిలో మధు వాళ్ళ ఇంటి ముందు మూలకు టెంకల పక్కన ఒక ఇనుప పార కనిపించగా, దాన్ని అందుకుని మధు తలపై రెండు మూడు దెబ్బలు గట్టిగా కొట్టేసరికి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇట్టి విషయంపై రాజాపేట పోలీసు స్టేషన్‌లో Crime No.84/2026 U/Sec 103[1] BNS , సెక్షన్ 3(2)(v) of SC & ST (POA) యాక్ట్-1989 (హత్య నేరం, SC/ST అట్రాసిటీ యాక్ట్) కింద కేసు నమోదు చేసి విచారణ అనతరం నిందితుడిని శనివారం అదుపులోని తీసుకొని కోర్టుకు తరలించారు. కోర్టు ముద్దాయి నానిని రిమాండ్ చేయగా భువనగిరి SDPO పి. శ్రీనివాస్ నాయుడు దర్యాప్తు చేస్తున్నారు.
