Fish eating helth benfits


Fish helthy benfits

చేపల కూర అంటేనే చాలామందికి నోరూరుతుంది. కదా అయితే ఎండు చేపలు  మాత్రం కొంతమంది ముక్కు మూసుకుంటారు. వాటి నుంచి వచ్చే వాసన వల్ల తినడానికి ఎక్కువ ఆసక్తి చూపరు.

కానీ ఆ వాసన వెనుక దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు తెలిస్తే మాత్రం మీ అభిప్రాయం మార్చుకోక తప్పదు.

 

పచ్చి చేపలను ఎండబెట్టడం వల్ల వాటిలోని సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా నశించిపోతాయి. ఈ సహజమైన పద్ధతి వల్ల చేపలు పాడవకుండా చాలా కాలం పాటు నిల్వ ఉంటాయి, తినడానికి సురక్షితంగా మారుతాయి. ఎండు చేపలతో ఎన్నో రకాల నోరూరించే వంటకాలను తయారు చేసుకోవచ్చు. అయితే పోషకాల పరంగా ఇవి పచ్చి చేపల కంటే చాలా శక్తివంతమైనవని, ముఖ్యంగా పురుషుల ఆరోగ్యానికి ఇవి ఒక సూపర్ ఫుడ్ వంటివని మీకు తెలుసా?

ఎముకలు దృఢంగా

పచ్చి చేపలతో పోలిస్తే ఎండు చేపల్లో కాల్షియం ఏకంగా రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చడమే కాకుండా, కీళ్ల నొప్పులను దరిచేరనివ్వదు. తరచుగా నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడే పురుషులు వారానికి 3 నుంచి 4 సార్లు తమ డైట్‌ లో ఎండు చేపలను చేర్చుకుంటే అద్భుతమైన మార్పును గమనించవచ్చు.

బీపీ కంట్రోల్, గుండె పదిలం

రక్తపోటు (బీపీ) సమస్యను అదుపులో ఉంచడానికి కూడా ఎండు చేపలు మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన మినరల్స్ ఇందులో మెండుగా ఉన్నాయి. ఇవి రక్తపోటు స్థాయిలను ఆరోగ్యకరమైన రీతిలో నియంత్రణలో ఉంచుతాయి.

కండరాలకు ఉక్కులాంటి బలం

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. తరచుగా కండరాల నొప్పితో బాధపడే పురుషులకు ఎండు చేపలు ఒక అద్భుతమైన ఔషధం. ఎండు చేపలు కండరాల మరమ్మత్తుకు ఎంతగానో సహాయపడతాయి. ఎక్కువ గంటలు కష్టపడి పనిచేసిన తర్వాత లేదా తీవ్రమైన శారీరక శ్రమ తర్వాత శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి అందించడంలో ఇవి ముందుంటాయి. దెబ్బతిన్న కణజాల పునరుత్పత్తిని మెరుగుపరిచి, కండరాల అలసటను మాయం చేస్తాయి.

 

హార్మోన్ల బ్యాలెన్స్, ఒత్తిడి దూరం

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పురుషులు తీవ్రమైన ఒత్తిడి, నీరసానికి గురవుతున్నారు. ఎండు చేపలలోని పోషకాలు శరీరంలోని జీవక్రియలకు తోడ్పడతాయి. ముఖ్యంగా పురుషులలో కొన్ని హార్మోన్ల పనితీరును సమతుల్యం చేసి, నీరసాన్ని, ఒత్తిడికి సంబంధించిన శారీరక సమస్యలను నియంత్రిస్తాయి.

ఒళ్లు నొప్పులకు చెక్

ఎండు చేపల్లో ప్రోటీన్లతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన దీర్ఘకాలిక నొప్పులను, వాపులను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.

తినడానికి సరైన సమయం ఇదే

పోషకాహార నిపుణుల సలహా ప్రకారం..దీర్ఘకాలిక కండరాల నొప్పులతో బాధపడే పురుషులు, ఉదయం అల్పాహారం తీసుకున్న కొన్ని గంటల తర్వాత ఎండు చేపలను స్నాక్స్‌ లా (చిరుతిండిగా) తీసుకుంటే అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఎండు చేపల్లోని పోషకాలను శరీరం వేగంగా, పూర్తిగా గ్రహిస్తుంది.