శక్తి యాప్‌తో అర్ధరాత్రి అమ్మాయిని కాపాడిన పోలీసులు.
అర్థరాత్రి అమ్మాయిపై ఓ ఆటో డ్రైవర్ అత్యాచారం చేస్తుండగా పోలీసులు కాపాడారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ శివారలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఓ యువతి బెంగళూరులో ఉద్యోగం చేస్తుంది. అర్థరాత్రి ఆమె విజయవాడ బస్టాండ్‌కు చేరుకుంది. రాత్రి సమయంలో నంబూరుకు వెళ్లడం మంచిది కాదని బస్టాండ్‌లో వెయిట్ చేస్తోంది. ఓ ఆటో డ్రైవర్ నంబూరుకు వెళ్తానని పలుమార్లు ఆమెను అడిగాడు. ఆటోలో వెళ్లడం సురక్షితం కాదని అక్కడే ఉండిపోయింది. ఆటో డ్రైవర్ మళ్లీ వచ్చి అడగడంతో సరేనని వెళ్లింది. అప్పటికే యువతి శక్తి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడంతో ఆటో నంబర్‌ను యాఫ్ ఎంటర్ చేసింది.
విజయవాడ నుంచి డిజిపి కార్యాలయం దాటిన వెంటనే ఆమెతో ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. పోలీసులు ఆటోను వెంబడించి పట్టుకున్నాడు. ఆటో డ్రైవర్ కొలను కొండకు చెందిన ఫణీంద్రగా గుర్తించారు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో అతడి వ్యవహారశైలిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శక్తి యాప్ ద్వారా యువతిని పోలీసులు కాపాడడంతో మంత్రి నారా లోకేష్ మంగళగిరి పోలీసులను అభినందించారు. మహిళల భద్రతకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.
