విజయవాడ, మే 12 (ఆంధ్రజ్యోతి): 'సూపర్ ప్రెజర్ బెలూన్'... ఇప్పటి వరకు అమెరికా, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలకే పరిమితమైన ఈ టెక్నాలజీ భారత్‌కూ పరిచయం కానుంది.
విజయవాడకు చెందిన రెడ్ బెలూన్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ రూపొందించిన ఈ సూపర్ ప్రెజర్ బెలూన్ దేశంలోనే తొలిసారిగా గాల్లోకి ఎగరనుంది. బుధవారం ఉదయం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ బెలూన్ పనితీరుని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు.గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్, టెలికాం సేవలందించే లక్ష్యంతో చేసిన ఈ బెలూన్లు 25 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగిరి 'నియర్ స్పేస్' ప్రాంతంలో పనిచేస్తాయి.
