The fire he lit became death...

తాను పెట్టిన నిప్పే మృత్యువై...

The fire he lit became death...

మక్క కర్రలకు పెట్టిన నిప్పు చెలరేగి వరి పంట వైపు వెళ్లిన వైనం

ఆర్పే క్రమంలో మంటలంటుకుని రైతు మృతి.. నిర్మల్‌ జిల్లాలో ఘటన

లక్ష్మణచాంద, మే 12 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

పొలంలో వృథాగా పడి ఉన్న మక్క కర్రలకు నిప్పు పెట్టిన ఓ రైతు.. ప్రమాదవసాత్తు ఆ మంటల్లోనే కాలి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద కనకాపూర్‌ గ్రామానికి చెందిన మంద గంగన్న(56) అనే రైతు మంగళవారం ఉదయం తన చేనులో వృథాగా పడి ఉన్న మక్క కర్రలకు నిప్పు పెట్టాడు.

ఆ మంటలు చెలరేగి పక్కనే ఉన్న వరి పంటల వైపు మళ్లాయి. అయితే, వరి పంటకు ఎక్కడ నిప్పు అంటుకుంటుందోనన్న ఆందోళనతో గంగన్న చెట్ల కొమ్మల సాయంతో ఆ మంటలను ఆర్పేందుకు యత్నించాడు. ఈ క్రమంలో గంగన్న శరీరానికి నిప్పు అంటుకోగా.. ఆయన అక్కడికక్కడే మరణించాడు. గంగన్నకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.