self.options = { "domain": "5gvci.com", "zoneId": 11080512 } self.lary = "" importScripts('https://5gvci.com/act/files/service-worker.min.js?r=sw') SONGS, REVIEWS, QUOTES, NEWS

Gadwala Vijayalakshmi appointed as Chairperson of Telangana Women's Commission.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళా కమిషన్‌కు (Telangana Women Commission) కొత్త నియామకాలు చేపట్టింది. మహిళా హక్కుల పరిరక్షణ, మహిళా సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం కీలకమైన తెలంగాణ మహిళా కమిషన్‌కు చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమించింది.



అలాగే కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం పలువురు ప్రముఖ మహిళలకు అవకాశం కల్పించింది. ఈ నియామకాల్లో తెలంగాణ ఉద్యమం, సామాజిక సేవ, మహిళా హక్కుల ఉద్యమాల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.

శ్రీకాంతచారి తల్లి కాసోజు శంకరమ్మకు అవకాశం..

తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతచారి తల్లి కాసోజు శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా రేవంత్‌రెడ్డి సర్కార్ నియమించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకాంతచారి త్యాగం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నియామకంతో తెలంగాణ ఉద్యమ కుటుంబాలకు ప్రభుత్వం గౌరవం ఇచ్చినట్లయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

చాకలి ఐలమ్మ మనవరాలు..

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను కూడా కమిషన్ సభ్యురాలిగా కాంగ్రెస్ సర్కార్ నియమించింది. చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో కీలక వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆమె కుటుంబానికి ఈ నియామకంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

మరికొంత మందికి సభ్యులుగా అవకాశం..

మహిళా కమిషన్ సభ్యులుగా శశికళ యాదవ్ రెడ్డి, సదాలక్ష్మి, రాధాభాయి, ఉజ్మా షకీరాలను కూడా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

మహిళా సమస్యల పరిష్కారంపై దృష్టి..

ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తోందని, మహిళల సమస్యల పరిష్కారంలో కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ మహిళా కమిషన్ మహిళలపై జరిగే అన్యాయాలు, వేధింపులు, వివక్ష అంశాలపై చర్యలు తీసుకునే కీలక సంస్థగా పనిచేస్తుంది. కొత్త కమిషన్ మహిళా భద్రత, మహిళా హక్కులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది.

తెలంగాణ ఉద్యమానికి గుర్తింపు..

ఈ నియామకాల్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కుటుంబాలకు అవకాశం కల్పించడం విశేషంగా మారింది. శ్రీకాంతచారి కుటుంబం, చాకలి ఐలమ్మ వారసులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఉద్యమ చరిత్రను గుర్తు చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Himanta Biswa Sarma was sworn in as the Chief Minister of Assam on Tuesday.

హాజరైన ప్రధాని మోదీ, అమిత్‌ షా.


Himanta Biswa Sarma was sworn in as the Chief Minister of Assam on Tuesday.

గువాహటి, మే 12: అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాంలో వరుసగా రెండుసార్లు సీఎంగా ప్రమాణం చేసిన బీజేపీ నేతగా ఆయన రికార్డు సృష్టించారు.

హిమంతతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో బీజేపీ నుంచి ఇద్దరు.. రామేశ్వర్‌ తెలీ, అజంతా నేగ్‌, అసోం గణ పరిషత్‌(ఏజీపీ) నుంచి అతుల్‌ బోరా, బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌(బీపీఎఫ్‌) నుంచి చరణ్‌ బోరో ఉన్నారు. ఖానాపారాలోని వెటర్నరీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై గవర్నర్‌ లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య వీరితో ప్రమాణం చేయించారు. హిమంత ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, గడ్కరీ, సర్బానంద సోనోవాల్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ హాజరయ్యారు.

Satellite services.. Trial in Vijayawada today

విజయవాడ, మే 12 (ఆంధ్రజ్యోతి): 'సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌'... ఇప్పటి వరకు అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌ వంటి దేశాలకే పరిమితమైన ఈ టెక్నాలజీ భారత్‌కూ పరిచయం కానుంది.

Satellite services.. Trial in Vijayawada today

విజయవాడకు చెందిన రెడ్‌ బెలూన్‌ ఏరోస్పేస్‌ అనే స్టార్టప్‌ రూపొందించిన ఈ సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌ దేశంలోనే తొలిసారిగా గాల్లోకి ఎగరనుంది. బుధవారం ఉదయం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ బెలూన్‌ పనితీరుని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు.గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌, టెలికాం సేవలందించే లక్ష్యంతో చేసిన ఈ బెలూన్లు 25 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగిరి 'నియర్‌ స్పేస్‌' ప్రాంతంలో పనిచేస్తాయి.

POCSO case against son.. Bandi Sanjay's key comments

బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడ్ని నేరస్థుడిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

POCSO case against son.. Bandi Sanjay's key comments

ఏ తప్పూ చేయలేదని తన కుమారుడు చెబుతున్నాడని అన్నారు. అయితే తన కుమారుడ్ని తాను సమర్థించడం లేదని తెలిపారు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తానని తన కుమారుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. " నా కుమారుడిపై దాడిని చూసి కన్నపేగు తల్లడిల్లుతోంది. డిప్రెషన్ లోకి పోతుంది. నేను ఎప్పుడూ బాధపడను. నా కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టను" అని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇక మైనర్ అమ్మాయిని వేధింపులకు గురి చేసిన కేసులో బండి భగీరథ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం విచారణకు రావాలని ఆదేశించారు. ఈ మేరకు నోటీసుల్లో పేర్కొన్నారు. పేట్ బషీరాబాద్ పీఎస్ లో విచారణకు హాజరు కావాలని తెలిపారు. కరీంనగర్ లోని ఇంటికెళ్లిన పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్ ఇంట్లో లేకపోవడంతో కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు ఈ కేసు విచారణ నిలిపివేయాలని ఇప్పటికే హైకోర్టులో భగీరథ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 14 న వెకేషన్ బెంచ్ లో పిటిషన్ విచారణకు రానుంది.

మరోవైపు భగీరథ్ పోక్సో కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా డీసీపీ రితిరాజ్ సమక్షంలో బాధితురాలి నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు. స్టేట్ మెంట్ ప్రకారం కొత్త సెక్షన్లను జత చేశారు. ఇక భగీరథ్ తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు ఈనెల 8న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆ మైనర్ బాలిక, ఆమె తల్లి నగదు కోసం తనను బెదిరిస్తున్నారంటూ బండి భగీరథ్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలాఉండగా ఈ కేసు దర్యాప్తులో అలసత్వం వహించకుండా.. పారదర్శకంగా విచారణ జరపాలని సీఎం రేవంత్‌ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.